← Back to news

BRS జిల్లా కార్యాలయంలో కృత్రిమ కోనేరు ఏర్పాటు

By K. VENKATESH· 1d ago· Khammam
BRS జిల్లా కార్యాలయంలో కృత్రిమ కోనేరు ఏర్పాటు

ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళల సౌకర్యార్థం ఎమ్మెల్సీ తాతా మధు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యాలయ ఆవరణలో కృత్రిమ కోనేరు ఏర్పాటు చేయించారు. సద్దుల బతుకమ్మ వేడుకల అనంతరం మహిళలు తమ బతుకమ్మలను స్వయంగా నిమజ్జనం చేసుకునేలా ఈ సదుపాయం కల్పించారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More in Local