← Back to news

బతుకమ్మ వేడుకల్లో విజయ్ - రష్మిక

By Sahani· 7h ago· Hyderabad

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సందడి చేశారు. పెళ్లి తర్వాత తొలిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న రష్మిక, సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క నూతన దంపతులను శాలువాలతో సత్కరించగా.. రంగురంగుల పూల బతుకమ్మలు, బాణసంచా ప్రదర్శనలతో ట్యాంక్ బండ్ పండుగ వాతావరణంతో నిండిపోయింది.

More in Entertainment