హిట్, ఫ్లాప్ కామన్.. యష్ కామెంట్స్

KGF 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ టైంలో బెంగళూరులో జరిగిన ‘రామాయణ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యష్ స్పందించారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఇండస్ట్రీలో కామన్ అని అన్నారు. తనకు మద్దతుగా నిలిచి సినిమా చూసిన అభిమానులకు, కన్నడ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. మీ రుణాన్ని ఎప్పటికీ పూర్తిగా తీర్చుకోలేనన్నారు. ఏ సినిమా ఎలాంటి ప్రేక్షకుల కోసం తీస్తున్నామో తమకు స్పష్టత ఉందని యష్ చెప్పారు.


