ఏపీలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

AP: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను రిలీజ్ చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్-1లో 149 పోస్టులు, గ్రూప్-2లో 673 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక శాఖలు, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖలలోనూ ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది.



