← Back to news

సీనియర్ దర్శకుడు రవిచంద్ర కన్నుమూత

By A.Ajay· 7h ago
సీనియర్ దర్శకుడు రవిచంద్ర కన్నుమూత

సీనియర్ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రవిచంద్ర (84) హైదరాబాద్‌లో కన్నుమూశారు. హీరో కృష్ణతో ‘రౌడీ నంబర్‌ వన్‌’, ‘కిరాయిగూండా’, ‘సార్వభౌముడు’ వంటి సినిమాలు, బాలకృష్ణతో ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’, వెంకటేశ్‌తో ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్‌ నటించిన ‘మహాగురు’ సహా ఆరు హిందీ సినిమాలు, ఓ కన్నడ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి.

More in Entertainment