నీళ్లతో కోరికలు నిజమవుతాయా? వాటర్ మ్యానిఫెస్టింగ్!

సోషల్ మీడియాలో ఇప్పుడు “వాటర్ మ్యానిఫెస్టింగ్” ట్రెండ్ వైరల్ అవుతోంది. ఒక గ్లాస్ నీటిని చేతిలో పట్టుకుని, మనకు కావాల్సిన లక్ష్యం లేదా కోరికను మనసులో ఊహించుకుంటూ.. “నేను అనుకున్నది సాధిస్తాను” అంటూ పాజిటివ్‌గా చెప్పుకుని ఆ నీటిని తాగుతారు. అంటే మనకు మనమే మంచి మాటలు చెప్పుకోవడం అన్నమాట. ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ ప్రమోషన్‌లో నటి శ్రీ గౌరీ ప్రియ కూడా వాటర్ మ్యానిఫెస్టింగ్ గురించి మాట్లాడుతూ.. “నాకు వాటర్ మ్యానిఫెస్టింగ్‌పై చాలా నమ్మకం ఉంది” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.



