← Back to news

ACB సోదాల్లో NIMS డాక్టర్.. కోట్ల రూపాయల ఆస్తులు!

By Mahesh· 4h ago· Siasat· TG
ACB సోదాల్లో NIMS డాక్టర్.. కోట్ల రూపాయల ఆస్తులు!

TG: NIMS అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌కు భారీగా ఆస్తులు ఉన్నట్లు ACB అధికారులు గుర్తించారు. ఆయన ఇంటితో పాటు మరో 7 చోట్ల ఒకే టైమ్‌లో రైడ్స్ చేశారు. కూకట్‌పల్లి, మణికొండ, పేట్‌ బషీర్‌బాద్, యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట, విశాఖలో ప్లాట్లు గుర్తించినట్లు తెలిపారు. బ్యాంకు, పోస్టాఫీస్ డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్స్, 517 గ్రాముల బంగారం, 3 కార్లు కూడా గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ 80 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని <a href="https://x.com/TheSiasatDaily/status/2102390388061544609">ACB తెలిపింది.</a>

More in TG