← Back to news

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పవర్ కట్స్

By BK· 7 Oct 2026· సంగారెడ్డి, మెదక్
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పవర్ కట్స్

TG : సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు గ్రామాల రైతులు కరెంట్ కోతలపై మండిపడుతున్నారు. పంటలకు అవసరమైన టైమ్‌లో కరెంట్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. ఎండలు పెరుగుతున్న వేళ పవర్ కట్స్ పెరగడం శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కరెంట్ కోతలు తగ్గించి నిరంతరాయంగా కరెంట్ ఇవ్వాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

More in TG