EVలో వెళ్తే వాంతుల ఫీలింగా? ఇదే కారణం!

పెట్రోల్ కార్లతో పోలిస్తే కొన్ని EVల్లో ట్రావెల్ చేసేటప్పుడు కొందరికి తల తిరగడం, వాంతుల ఫీలింగ్ రావొచ్చు. EVలు సైలెంట్‌గా ఉండటం, స్పీడ్ ఒక్కసారిగా పెరగడం, బ్రేక్ వేయగానే త్వరగా స్లో అవడం దీనికి కారణాలు. ఇంజిన్ సౌండ్, వైబ్రేషన్స్ తక్కువగా ఉండటంతో కారు కదలికలను మెదడు ముందుగా అంచనా వేయలేకపోవచ్చు. కళ్లకు కనిపించే కదలికలు, లోపలి చెవి గుర్తించే కదలికల మధ్య తేడా వల్ల మోషన్ సిక్‌నెస్ రావొచ్చు. అయితే ఈ సమస్య డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి మారుతుంది.



