'Gen-Alpha' తిరుగుబాటు!
UP ఫతేపూర్‌లోని సర్వోదయ ఇంటర్ కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్కూళ్లో తాగడానికి మంచి నీళ్లు లేవని, టాయిలెట్లు దారుణంగా ఉన్నాయని, కనీసం కూర్చోవడానికి బెంచీలు కూడా సరిగ్గా లేవని 'Gen-Alpha' కిడ్స్ అంబేద్కర్ ఫోటోలు చేతపట్టి ఆందోళన చేశారు. ఎన్నిసార్లు ప్రిన్సిపల్‌కి చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఇలా రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసినా, పిల్లలు తమ హక్కుల కోసం ఇలా పోరాడడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తు కామెంట్స్ పెడుతున్నారు.



