← Back to news

నిరుద్యోగులకు న్యాయం చేయాలని వినతి

By dk· 13 Aug 2026· హైదరాబాద్
నిరుద్యోగులకు న్యాయం చేయాలని వినతి

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో మూడు జిల్లాలకు ఖాళీలు ప్రకటించకపోవడంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌లో 7,112 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడినా మేడ్చల్‌, యాదాద్రిభువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఖాళీలు చూపించలేదని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.

More in Jobs