డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు

TG: Transfer Certificate(TC) ఇవ్వలేదనే కారణంతో స్టూడెంట్స్ అడ్మిషన్లను తిరస్కరించవద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని చెప్పింది. అడ్మిషన్ తిరస్కరించిన ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.



