← Back to news

ప్రైవేటీకరణ దిశగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ?

By DK· 26 Aug 2026
ప్రైవేటీకరణ దిశగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ?

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మొత్తం CISF బలగాలను ఉపసంహరించాలన్న కేంద్ర హోంశాఖ <a href="https://www.theclearcutnews.com/n/j5nzAqU">నిర్ణయం</a> కలకలం రేపుతోంది. ప్లాంట్‌లోని సెక్యూరిటీ వింగ్‌లో 1,033 మంది, ఫైర్ వింగ్‌లో 298 మంది CISF సిబ్బందిని నవంబర్ 17, 2026 నాటికి ఉపసంహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపసంహరణకు ముందు CISFకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించి నో-డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించింది. ఈ నిర్ణయం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగమేనని కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

More in AP