← Back to news

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన ఎమ్మెల్యే

By SK RAFI· 1d ago· Bhadradri Kothagudem

సద్దుల బతుకమ్మ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పండుగ సంబరాల్లో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆడపడుచుల ఐక్యత, ఆత్మీయతను చాటే ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు. వేడుకల్లో మహిళలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

More in Local