ప్రపంచంలోని డేంజరస్ అగ్నిపర్వతం మళ్లీ యాక్టివ్ 🌋
సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలా దేశంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత యాక్టివ్, డేంజరస్ అగ్నిపర్వతాల్లో ఒకటైన ఫ్యూగో (Fuego) మళ్లీ పేలింది. లావా, బూడిద, మంటల్లా వేడిగా ఉండే గ్యాస్‌లు కిందికి దూసుకొస్తుండటంతో రెండు గ్రామాల ప్రజలను సేఫ్ ప్లేస్‌లకు తరలించారు. దేశవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు స్కూల్స్‌కు సెలవులు ఇచ్చి, ఎవరూ అగ్నిపర్వతం దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇంకా భారీగా బూడిద గాలిలో వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు.



