← Back to news

కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు: తలసాని

By DK· 1h ago
కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు: తలసాని

TG: ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెయ్యి రోజులు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు. KCR హయాంలో విద్యుత్, సాగునీటి రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్, నీటి సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

More in TG