గూండాకి ఢిల్లీ పోలీస్ ఆశీర్వాదం
ఢిల్లీలో గౌరవ్ హిందు అనే వ్యక్తి ఓ పోలీసు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. అక్టోబర్ 10న ప్రొటెస్టర్లపై దాడులకు పాల్పడ్డాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ మహ్మద్ జుబైర్ ప్రశ్నించారు. అసలు ప్రొటెస్టర్లపై దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే చర్చ మొదలైంది.
