ఒక్క రూపాయి కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్న కొడుకు!

రాజస్థాన్‌లో ఒక ఫ్యామిలీ అందరికీ ఆదర్శంగా నిలిచింది. అర్జున్‌రామ్ అనే వ్యక్తి తన కొడుకు సుభాష్ పెళ్లిని సరోజ్ అనే అమ్మాయితో ఫిక్స్ చేశాడు. అయితే ఈ పెళ్లిలో ఎలాంటి కట్నం తీసుకోకూడదని ముందే డెసిషన్ తీసుకున్నారు. అనుకున్నట్లే పెళ్లి టైమ్‌లో పెళ్ళికొడుకు కేవలం ఒక్క రూపాయి, కొబ్బరికాయ మాత్రమే తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. కట్నం తీసుకోకూడదనే తన తండ్రి డెసిషన్‌పై కొడుకు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.



