ఐదేళ్ల బాలుడికి టార్చ్ వెలుగులో వైద్యం
AP: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి బిడ్డిక జీవన్(5) కాలిన గాయాలతో వచ్చాడు. ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడటంతో గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు జనరేటర్ సదుపాయం కూడా లేకపోవడంతో వైద్యులు టార్చ్ వెలుగులో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నూతన ఆస్పత్రిలోనే కనీస సౌకర్యాలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.



