పోలీస్ స్టేషన్ ముందే మహిళ దారుణ హత్య.
AP:పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుటే నడిరోడ్డుపై వేల్పూరుకు చెందిన 35 ఏళ్ల మహిళ బంధువుల ఇంటికి వెళ్లేందుకు పోలీస్ స్టేషన్ ఎదుట ఆటో ఎక్కుతుండగా ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో మహిళపైనా నిందితుడు దాడి చేశాడు. తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



