రాత్రిపూట జంతువుల కళ్లు ఎందుకు మెరుస్తాయి?

రాత్రిపూట జంతువుల కళ్లు మెరుస్తుంటాయి. ఇలా మెరవడానికి ప్రధాన కారణం వాటి కంటిలో ఉండే 'టేపెటమ్ లూసిడమ్'(Tapetum Lucidum) అనే ప్రత్యేకమైన పొర. ఈ టేపెటమ్ లూసిడమ్ కంటిలోని రెటీనా వెనుక ఉండే ఒక పరావర్తన పొర. ఇది అద్దంలా కాంతిని తిరిగి వెనక్కి పంపిస్తుంది. కంటిలోకి వెళ్లిన కాంతి కిరణాలు రెటీనాలోని కాంతి గ్రాహకాలకు అందనప్పుడు, ఈ పొర ఆ కాంతిని మళ్లీ రెటీనాలోకి వెనక్కి పంపుతుంది. దీనివల్ల తక్కువ కాంతిలో కూడా జంతువులకు స్పష్టంగా కనిపిస్తుంది.



