రూ.1కే AC ఫంక్షన్ హాల్..ఎక్కడంటే!

AP: నెల్లూరులో పేద, మధ్యతరగతి ప్రజల కోసం మున్సిపల్ కార్పొరేషన్ కేవలం రూపాయికే సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మంత్రి నారాయణ దీన్ని ప్రారంభించారు. రూ.1.40 కోట్ల వ్యక్షంతో నిర్మించిన ఈ హాల్‌లో ఐదువేల మంది కూర్చోవచ్చు. ఎన్‌క్యాప్ నిధులు రూ. 25 లక్షలు, కార్పొరేషన్ నిధులు రూ.1.15 కోట్లతో దీన్ని నిర్మించారు.



