కుప్పకూలిన మరో భవనం
ఉత్తరప్రదేశ్.. మొరాదాబాద్‌లో భారీ వర్షాలతో 3 అంతస్తుల పాత భవనం 4 సెకన్లలో కూలిపోయింది. ముగల్‌పురా ప్రాంతంలోని జామా మసీదు రోడ్ దగ్గర్లో జరిగిన ఈ ఘటనలో భవనం పూర్తిగా కూలిపోయి.. ఆ ఏరియా దుమ్ముతో నిండిపోయింది. దగ్గర్లోని షాపులు, ఇళ్ల వైపు శిథిలాలు చెల్లాచెదురయ్యాయి. ప్రాణనష్టం లేదు. సెప్టెంబర్ 4న అధికారులు భవనాన్ని చెక్ చేసి ప్రమాదకరమని సీల్ చేశారు. పోలీసులు ఆ రోడ్డును బారికేడ్ చేశారు. వర్షాలు భవనాన్ని మరింత బలహీనపరిచాయి. కూలిన తర్వాత పోలీసులు, మున్సిపల్ టీములు శిథిలాలను తొలగించాయి.


