AIతో ఔషధ పరిశోధనలకు కొత్త ఊపు

TG: భారతదేశ ప్రాచీన సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సుతో అనుసంధానించడం ద్వారా మానవాళికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధాలను కనుగొనవచ్చని శాతవాహన యూనివర్సిటీ VC ఉమేష్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని SU పరిధిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో "సహజ సిద్ధ ఔషధాల ఆవిష్కరణలో AI పాత్ర" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పరిశోధనల్లో ఇలాంటి నూతన సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సహజ సిద్ధమైన మూలికా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలంటే శాస్త్రీయమైన డేటా, పరిశోధనలు ఎంతో అవసరమన్నారు.



