← Back to news

చీకట్లో 4 కిలోమీటర్లు నడిచిన గర్భిణి

By BK· 5 Aug 2026· AP

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టెంకబుడ్డి గ్రామానికి చెందిన గర్భిణి శాంతికి అర్ధరాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఊరికి రోడ్డు సౌకర్యం లేక వాహనాలు గ్రామానికి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు చీకట్లోనే సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులో ఆమెను 4 కిలోమీటర్లు నడిపించుకుంటూ కృష్ణాపురం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో శృంగవరపుకోట ఆసుపత్రికి తీసుకెళ్లారు.

More in News