టీచర్ దెబ్బలకు.. 2nd Class బాలుడు

TG: మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ క్లాస్ విద్యార్థిపై ఓ ఉపాధ్యాయుడు కర్రతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలుడు ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ పెంచాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

