కరెంటు ఛార్జీలపై ఆందోళన
తెలంగాణ ప్రభుత్వం నవంబర్ నుంచి కరెంటు ఛార్జీలను పెంచాలనే నిర్ణయం తీసుకోవడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సోలార్, విండ్ పవర్ లాంటి టెక్నాలజీలను అమల్లోకి తేవడం ద్వారా.. కరెంటు ఛార్జీలను పెంచకుండా చెయ్యవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని BRS డిమాండ్ చేస్తోంది. అసలే ప్రజలు కష్టాల్లో ఉంటే.. వారిపై రూ.5,420 కోట్ల భారం వెయ్యాలనుకోవడం అన్యాయం అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. మొదటి నెల యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత 50 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

