బ్రేక్ తర్వాత మళ్లీ కెరీర్

పెళ్లి, పిల్లల పెంపకం లేదా కుటుంబ బాధ్యతల కారణంగా కొంతకాలం ఉద్యోగానికి దూరమైన మహిళలు మళ్లీ కెరీర్‌లోకి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం తమ రంగంలో వచ్చిన కొత్త మార్పులు, టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ కోర్సులతో కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. రెజ్యూమేలో కెరీర్ గ్యాప్ దాచకుండా, గత అనుభవం, స్కిల్స్ ని స్పష్టంగా చూపించాలి. లింక్డ్‌ఇన్ వంటి వేదికల్లో పాత సహచరులతో పరిచయాలు పెంచుకోవాలి. ఇంటర్న్షిప్ అవకాశాలను కూడా ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



