నామినేషన్లపై ఉద్రిక్తత.. YCP ఆరోపణలు
కర్నూలు జిల్లా ఆలూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలూరు-3 వైసీపీ MPTC అభ్యర్థిని నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఎస్సై మన్మధ విజయ్ అడ్డుకుని ఈడ్చుకెళ్లారని YCP నాయకులు ఆరోపించారు. మహిళలను సైతం పక్కకు నెట్టారని పేర్కొన్నారు. అభ్యర్థులకు రక్షణ కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా చూడాలని డిమాండ్ చేశారు.



