← Back to news

ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

By DK· 30 Jul 2026
ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

AP: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్-2026 అమలుపై నిర్వహించిన సమీక్షలో మొత్తం 10,060 పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రెండో దశ నోటిఫికేషన్‌ను సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్ 15న, మూడో, నాలుగో దశలకు సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

More in Jobs