← Back to news

రూ.2.5 కోట్లతో గిరిజన హాస్టల్ నిర్మాణం మంత్రి శంకుస్థాపన

By Ramesh Kondru· 1h ago· Khammam
రూ.2.5 కోట్లతో గిరిజన హాస్టల్ నిర్మాణం మంత్రి శంకుస్థాపన

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని TNGOs కాలనీలో గిరిజన బాలుర పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ హాస్టల్‌ను 2.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. త్వరలో బాలికల హాస్టల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తామని మంత్రి చెప్పారు. అనంతరం ముత్తగూడెంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నదానాన్ని ప్రారంభించి, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

రూ.2.5 కోట్లతో గిరిజన హాస్టల్ నిర్మాణం మంత్రి శంకుస్థాపన

More in Local