ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ఆటో ఢీకొని బొంతల అనిల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ పెయింటింగ్ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన అతడిని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.



