← Back to news

సూరత్‌లో బతుకమ్మ సందడి!

By M.Malaji· 1h ago· Nizamabad, Nizamabad South, Nizamabad
సూరత్‌లో బతుకమ్మ సందడి!

గుజరాత్‌లోని సూరత్‌లో తెలంగాణ వైభవాన్ని చాటుతూ సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బాలాజీ నగర్ (GHB) అసోసియేషన్, సిద్ధి వినాయక మందిర కమిటీ, పద్మశాలీ సమాజం, కల్పన ప్రియాంక టౌన్ కైలాస్ నగర్ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. స్థానిక తెలంగాణ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చారు. సూరత్‌లో తెలంగాణ సంస్కృతిని చాటుతున్న మహిళలను నిర్వాహకులు అభినందించారు. ఈ ఉత్సవంలో అంబటి పద్మ, వెంకటమ్మ, నిర్మల, సామల ఝాన్సీ, తుమ్మ పుష్పమ్మ పాల్గొన్నారు.

సూరత్‌లో బతుకమ్మ సందడి!
సూరత్‌లో బతుకమ్మ సందడి!

More in Local