రేపు ఇల్లందులో ఘనంగా దసరా ఉత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రేపు సాయంత్రం దసరా సెలబ్రేషన్స్ జరగనున్నాయి. కోర్టు ఎదురుగా ఉన్న ఫారెస్ట్ గ్రౌండ్‌లో జరిగే ఈ వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. జబర్దస్త్ టీమ్‌కు చెందిన వినోద్, అభి, రాజమౌళి కామెడీతో అలరించనున్నారు. పాడుతా తీయగా గాయకుల మ్యూజిక్ ప్రోగ్రామ్, మిమిక్రీ షోలు కూడా ఉండనున్నాయి.



