ఆస్తులున్నా భరణం ఇవ్వాల్సిందే

మద్రాస్ హైకోర్టు భార్యాభర్తల మెయింటెనెన్స్ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. 1.7 కోట్ల ఫ్లాట్, లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ ఒక మహిళకు నెలకు 1 లక్ష భరణం ఇవ్వాలని కోర్టు ఆర్డర్ వేసింది. మోడల్‌గా పనిచేసిన ఆమెను ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ పెళ్లి చేసుకుని బాబు పుట్టాక వదిలేశాడు. తనకు ఆల్రెడీ పెళ్లయిందని, ఆమెకు ఆస్తులు ఉన్నాయని సదరు ప్రొడ్యూసర్ వాదించగా, బాబు పుట్టాక ఆమెకు ఎలాంటి రెగ్యులర్ ఇన్‌కమ్ లేనందున నెలకు 1 లక్ష భార్యకు, 1.5 లక్షలు బాబుకు ఇవ్వాల్సిందేనని జస్టిస్ సుందర్ మోహన్ స్పష్టం చేశారు.



