మిమ్మల్ని మీరు మర్చిపోకండి!

నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఫ్యామిలీ, పిల్లలు, జాబ్.. ఇలా ఎన్నో బాధ్యతల మధ్య మహిళలు తమ గురించి తాము పట్టించుకోవడం మర్చిపోతున్నారు. అందరి బాగోగులు చూసుకునే క్రమంలో తమ ఇష్టాలు, విశ్రాంతిని పక్కనపెడుతున్నారు. రోజూ కనీసం 15 నిమిషాలు మీకు నచ్చిన పని కోసం కేటాయించండి. ఇంటి పనులను ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మనసులో ఉన్న బాధను నమ్మకమైన వాళ్లతో చెప్పుకోండి. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా చేయాలనే ఒత్తిడి వద్దు. అవసరమైతే కౌన్సెలర్ సాయం తీసుకోండి. మీ మనసుకు కూడా కాస్త టైమ్ ఇవ్వండి.



