← Back to news

“LO”తో మొదలైన ఇంటర్నెట్ కథ!

By Nani· 16 Aug 2026
“LO”తో మొదలైన ఇంటర్నెట్ కథ!

ఇవాళ ప్రపంచాన్ని ఒక్క క్లిక్‌తో కలుపుతున్న ఇంటర్నెట్.. అసలు ఎలా మొదలైందో తెలుసా? 1969లో అమెరికా పరిశోధనా సంస్థ అర్పానెట్‌ను ప్రారంభించింది. దూరంగా ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోగలవా అనేదే లక్ష్యం. మొదట నాలుగు కంప్యూటర్లను మాత్రమే కలిపారు. తొలి సందేశంగా “LOGIN” పంపుతుండగా సిస్టమ్ క్రాష్ అయి “LO” మాత్రమే చేరింది. ఆ చిన్న ప్రయోగమే తర్వాత ప్రపంచాన్ని మార్చిన ఇంటర్నెట్‌కు పునాదిగా మారింది. ఒక చిన్న “LO”.. ఇంత పెద్ద మార్పుకు నాంది పలికింది!

More in Technology