← Back to news

పంది కిడ్నీతో 9 నెలలు జీవించిన వ్యక్తి

By Nani Garikina· 10h ago· Harvard
పంది కిడ్నీతో 9 నెలలు జీవించిన వ్యక్తి

మనిషికి పంది కిడ్నీ.. అది కూడా జీన్‌ మార్పులు చేసినదైతే? అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్‌ ఆండ్రూస్‌కు జీన్‌ ఎడిట్‌ చేసిన పంది కిడ్నీని అమర్చగా, అది 271 రోజులు పనిచేసింది. ఈ సమయంలో ఆయనకు డయాలసిస్‌ అవసరం లేకపోవడం విశేషం. తర్వాత పంది కిడ్నీని తొలగించి, మానవ దాత కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ఈ కేసు అవయవాల కొరత ఉన్న రోగులకు పంది అవయవాలను తాత్కాలిక ‘బ్రిడ్జ్‌’గా ఉపయోగించే అవకాశాన్ని చూపిస్తోంది. అయితే ఇది ఒక్క కేసు మాత్రమే.. మరిన్ని పరీక్షలు అవసరం. భవిష్యత్తులో అవయవ మార్పిడికి ఇది కొత్త మార్గం చూపొచ్చు.

More in Technology