గంజాయి దందా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్

AP: అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు ఛేదించారు. ఒడిశాలో కొనుగోలు చేసిన 600 KGల గంజాయిని తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జైలులో పరిచయమైన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మస్తాన్‌వలి, నర్సీపట్నానికి చెందిన మరోవ్యక్తి కలిసి అక్రమ రవాణాకు ప్లాన్ వేశారు. మల్కాన్‌గిరి నుంచి గంజాయిని చింతపల్లి వరకు తరలించి, తుని మీదుగా వ్యాన్‌లో తమిళనాడుకు తీసుకెళ్లాలని నిర్ణయించగా పోలీసులు పట్టుకున్నారు. మస్తాన్‌వలి, మదీనా, పాంగి రత్నాలను అరెస్ట్ చేశారు.



