ఆటోతో సైడ్ బిజినెస్.. ఫస్ట్ డేనే డ్రైవర్ జంప్!

సైడ్ ఇన్కమ్ కోసం ఆటో కొన్న ఓ కార్పొరేట్ కంపెనీ టెకీకి ఊహించని షాక్ తగిలింది. కార్పొరేట్ కంపెనీలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఆయన.. లక్ష 75వేలు పెట్టి ఆటో కొన్నాడు. రోజుకు 600 రూపాయలు రెంట్ వస్తుందని ఆఫీస్ ప్యూన్ ఐడియాతో ఓ డ్రైవర్‌కు ఆటో అప్పగించాడు. కానీ ఫస్ట్ డేనే డ్రైవర్ ఆటోతో పరారైయ్యాడు. 15 రోజులు గడిచినా ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనను ఆఫీస్ కొలీగ్ గౌరవ్ తోమర్ <a href="https://x.com/talkwithgt/status/2105681140749324305">Xలో షేర్</a> చేయడంతో వైరల్‌గా మారింది.
