పాట్నాలో మహిళా పోలీసును కొట్టిన యువకుడు
బిహార్ రాజధాని పాట్నాలో 22 ఏళ్ల యువకుడు ప్రదీప్ కుమార్ మహిళా పోలీసును కొట్టాడు. సెప్టెంబర్ 30న ‘పోలీసు దీదీ’ బృందం పహారా వేస్తూ ఉంది. వీళ్లు స్కూళ్లు, కాలేజీల దగ్గర అమ్మాయిల భద్రత కోసం పహారా కాస్తారు. ముగ్గురు యువకులు అనుమానంగా కనిపించడంతో వాళ్లని ఆపారు. ప్రదీప్ కుమార్ వాళ్లతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఓ మహిళా పోలీసు అతణ్ని చెంపదెబ్బ కొట్టింది. అతను తిరిగి ఆమెను కొట్టాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రదీప్ కుమార్ను పట్టుకున్నారు.
