← Back to news

వరద బాధితుడిపై పిస్టల్ చూపిన పోలీస్..

By Nani Eluri· 5 Oct 2026· X

బిహార్‌లో వరద బాధితులకు రిలీఫ్ మెటీరియల్ పంపిణీ చేస్తుండగా ఓ పోలీస్ అధికారి పిస్టల్ చూపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సారణ్ జిల్లాలోని మకేర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సంగ్రామ్ కుమార్ సింగ్.. రిలీఫ్ కోసం వచ్చిన ఓ వ్యక్తిపై పిస్టల్ చూపించినట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీస్ అధికారులు అతడిని సస్పెండ్ చేసి, దీనిపై విచారించాలని ఆదేశించారు.

More in Viral