← Back to news

పెద్ది ఆరోగ్యం నిలకడగా ఉంది.. వదంతులు నమ్మొద్దు

By DK· 26 Jul 2026· వరంగల్ జిల్లా
పెద్ది ఆరోగ్యం నిలకడగా ఉంది.. వదంతులు నమ్మొద్దు

TG: నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు అత్యవసరంగా CPRతోపాటు ప్రత్యేక చికిత్స అందించగా, గుండె స్పందన తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని వెల్లడించారు. న్యూమోనియా తీవ్రత కారణంగా శరీరం పూర్తిగా సహకరించడం లేదని, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందన్నారు. మెరుగైనవైద్యం కోసం ఆయనను HYDకు తరలిస్తున్నట్లు తెలిపారు.

More in Health