'ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం'
స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అధికారులు సహకరించాలని రిటర్నింగ్ అధికారి కే. వెంకట్ రెడ్డి సూచించారు. ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారుల పర్యవేక్షణ, నిబంధనల అమలుపై అవగాహన కల్పించారు.



