43వ అంతస్తు నుంచి దూకి వ్యక్తి మృతి.. అసలేం జరిగింది?
ఢిల్లీలోని నోయిడాలో విషాద ఘటన జరిగింది. సెక్టార్ 94లోని సూపర్‌నోవా సొసైటీలో 35 ఏళ్ల సంభవ్ జైన్ 43వ అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. బాల్కనీ రైలింగ్‌పై ఉన్న ఆయనను గమనించిన AC రిపేర్ టీమ్ అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పోలీసుల ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్‌లో ఆయన ఫైనాన్షియల్ స్ట్రెస్‌లో ఉన్నట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని పోలీసులు చెప్పారు.
