ఐటీ రైడ్స్‌పై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ

నటి రకుల్ ప్రీత్ సింగ్ తనపై వచ్చిన పన్నుల ఆరోపణలను ఖండించారు. ఇటీవల తన భర్త జానీ భగ్నానీ నిర్మాణ సంస్థకు సంబంధించిన కేసులో ఐటీ శాఖ రైడ్స్ జరిగాయని, దానితో తనకు ఎలాంటి సంబందం లేదని చెప్పింది. తాను 20 ఏళ్ల వయసు నుంచే క్రమంగా పన్నులు చెల్లిస్తున్నానని తెలిపారు. విదేశాలకు అక్రమంగా డబ్బు పంపలేదని, ఎవరి పేరుతోనూ అక్రమ ఆస్తులు కలిగి లేనని స్పష్టం చేశారు. తనపై వచ్చిన తప్పుడు, ఊహాగానాల వార్తలను వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు.



