← Back to news

మనం నెగెటివ్ న్యూస్‌ని ఎందుకు ఎక్కువగా చూస్తాం?

By Nani Garikina· 2d ago
మనం నెగెటివ్ న్యూస్‌ని ఎందుకు ఎక్కువగా చూస్తాం?

రోజంతా మంచి వార్తలు కనిపించినా.. ఒక్క నెగెటివ్ న్యూస్ మాత్రం మన ఫోకస్‌ను వెంటనే లాగేస్తుంది. దీనికి మన మెదడులోని “Negativity Bias” ఒక కారణం. ప్రమాదం, భయం, నష్టం లాంటి విషయాలను మెదడు ముందుగా గుర్తించి ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే అలాంటి వార్తలను మళ్లీ మళ్లీ ఓపెన్ చేస్తాం. సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ కూడా మన ఆసక్తిని బట్టి ఇలాంటి కంటెంట్‌ను మరింత చూపించొచ్చు. అంటే మనం చెడ్డ వార్తలనే కోరుకుంటున్నామని కాదు.. మన మెదడు వాటిని ఎక్కువగా గమనించేలా తయారైంది.

More in Education