← Back to news

మంగళగిరిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

By BUJJIBABU· 1d ago· Guntur
మంగళగిరిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

గుంటూరు జిల్లా మంగళగిరి వీవర్స్ కాలనీ శ్రీ దుర్గా భవాని భక్త బృందం ఆధ్వర్యంలో దుర్గాష్టమి జ్యోతుల ఊరేగింపు గ్రాండ్‌గా జరిగింది. మహిళా భక్తులు జ్యోతులతో ఆత్మకూరు రోడ్, ఎల్బీనగర్, వీవర్స్ కాలనీల మీదుగా ర్యాలీగా వెళ్లారు. ఊరేగింపులో ప్రతిచోటా నెయ్యి, నువ్వుల నూనె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డప్పులు, మేళతాళాలు, నామస్మరణలతో పరిసరాలన్నీ మారుమోగిపోయాయి.

More in Local