మానసిక ఒత్తిడి తగ్గించడం టీచర్స్ బాధ్యత కాదు

UNESCO, UNICEF, WHO కలిసి ‘Teaching with Care’ గైడ్‌ను ఈనెల 10వ తేదీ రిలీజ్ చేశాయి. ఇందులో టీచర్లు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ప్రవర్తనలో మార్పులను గుర్తించవచ్చు, కానీ మానసిక సమస్యలను నిర్ధారించడం లేదా చికిత్స చేయడం టీచర్ల బాధ్యత కాదని స్పష్టం చేసింది. తెలంగాణకు సంబంధించిన 17 శాతం మంది స్టూడెంట్స్ చదువు విషయంలో ఒత్తిడి/ఆందోళనగా ఫీల్ అవుతున్నారని PARAKH 2024 సర్వేలో నమోదైంది. అలాంటి విద్యార్థులను తల్లిదండ్రులు, కౌన్సెలర్లు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం అవసరం అని చెప్పింది.



