APకి వర్ష సూచన.. మత్స్యకారులకు హెచ్చరిక

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా పయనిస్తూ నార్త్ ఒడిశా, ఝార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది ఒడిశాలోని మారుమూల ప్రాంతాల వైపు కదలనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నిన్న కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. సతివాడలో 4.95, అనంతపురంలో 3.62, బొబ్బిలిలో 3.25 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది. రానున్న 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలుల కారణంగా ఈరోజు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.



